Friday, 10 February 2017

శ్రీ బాలాజీ వెంకటేశ్వర జాతర , గంగాపూర్ రెబ్బెన ఆసిఫాబాద్ (కొమరం భీం) తెలంగాణా .

  శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంగాపూర్ గ్రామం , మండలం రెబ్బెన, కొమ్రం భీం జిల్లా . లో గల దేవాలయానికి చాల ప్రముక్యత ఉంది , ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం లో భక్తుల సమక్షం లో భారీ ఎత్తున జాతరను నిర్వహిస్తారు , వాగు వంకుల నడుమ గల ఆలయం ఏక శిలగా ఉంది ... మరియు  భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటారు , ఈ యొక్క ఆలయం ను రెండవ తిరుపతి గా కూడా పిలుస్తారు , ఈ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు , వీటితో పాటు దాతలు అందరు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ...














Wednesday, 8 February 2017

TSPSC Notification 7,306 Post

గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీ
Image result for tspsc logo
ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
టీజీటీకి టెట్ అర్హత తప్పనిసరి
ఫిబ్రవరి 10 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు 
 

 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో భారీ స్థాయిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,306 పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత గురుకులాల్లో అత్యధిక పోస్టులను ఈ ప్రకటన కింద ఇచ్చింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పాఠశాలలు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, స్టాఫ్ నర్సు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకులాల ఉపాధ్యాయ పోస్టుల కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. టీజీటీ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని, 20 శాతం వెయిటేజీ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. 

టీజీటీ పోస్టులు అధికం...

 
గురుకులాల ఉపాధ్యాయ ప్రకటనలో అత్యధికంగా 4,362 టీజీటీ పోస్టులు, ఆ తర్వాత 921 పీజీటీ పోస్టులున్నాయి. సొసైటీల వారీగా పోస్టులను తీసుకుంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కింద 2136, తెలంగాణ మైనార్టీ గరుకుల విద్యాలయాల సొసైటీ కింద 2080, మహాత్మా జ్యోతిబా పూలె సొసైటీ కింద 1789 పోస్టులను అత్యధికంగా భర్తీ చేస్తున్నారు. గిరిజన గురుకులాల సొసైటీ కింద 994 పోస్టులు, తెలంగాణ గురుకులాల సొసైటీ కింద 307 పోస్టులు పేర్కొన్నారు. గురుకు విద్యాలయాల సొసైటీ కింద భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షల విధానం, మార్కులు, సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఆయా వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది.

 
http://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp

Happy Valentines day 2017 || Valentines Day Special || How to make Valen...

Happy Valentines day 2017 || Valentines Day Special || How to make Valen...

Friday, 3 February 2017

ఆధార్ లేకుంటే ......?

వివిధ ర‌కాల సేవ‌ల‌ను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి. దీంతో పాటు వివిధ చోట్ల వ్య‌క్తిగ‌త, చిరునామా గుర్తింపుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఆధార్‌, ఆధార్ లెట‌ర్ సైతం త‌గిన గుర్తింపు ప‌త్రాలుగా ప‌నికొస్తాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌న‌ప్ప‌టికీ చాలా లావాదేవీల‌కు, స‌రికొత్త సేవ‌ల‌కు, ప‌థ‌కాల‌కు ఆధార్ అనుసంధానం ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం చాలా సంస్థ‌లు ఈకేవైసీని అంగీక‌రిస్తున్నాయి. కాబ‌ట్టి వెరిఫికేష‌న్‌కు ప‌ట్టే స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు శ్ర‌మ త‌గ్గుతుంది. 
1) ఆదాయ‌పు ప‌న్ను వ్య‌క్తులంతా ఆధార్‌ను పాన్‌(శాశ్వ‌త ఖాతా సంఖ్య‌)కు అనుసంధానించ‌డం మంచిది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో పాన్, అనుసంధానం జ‌రిగి ఉంటే మీరు ఐటీఆర్Vను ప్రింట్ తీసి పంపాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ప‌న్ను రిట‌ర్నుల ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వ‌డంతో పాటు మీ ఖాతాలో డ‌బ్బు త్వ‌ర‌గా జ‌మ‌వుతుంది
 2) బ్యాంకింగ్‌ బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ వ్యక్తిగ‌త‌, చిరునామా గుర్తింపుగా ఉప‌యోగప‌డుతుంది. ఆధార్ ఉంటే చాలు ఇక ఏ ఇత‌ర గుర్తింపు ప‌త్రాలు అవ‌స‌రం లేదు. ఒక్కోసారి ఈ ఆధార్‌ను సైతం బ్యాంకులు అంగీక‌రించే అవ‌కాశం ఉంది 
 3) డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ పెన్ష‌న‌ర్లు బ్యాంకులో ఆధార్ నంబ‌రు ఇస్తే వారి ప్ర‌క్రియ మ‌రింత సులువ‌వుతుంది. త‌మ‌కు చెల్లింపు జ‌రిగే బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌, బ్యాంకు పాస్‌బుక్ న‌క‌ళ్లు ఇచ్చి అనుసంధానం ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాలి. దీంతో ఆధార్ ఆధారిత డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ (జీవ‌న్ ప్ర‌మాణ్‌)ను సులువుగా పొంద‌వ‌చ్చు. దీంతో ప్ర‌తి ఏడాది బ్యాంకుకు వెళ్లాల్సిన అవ‌స్థ త‌ప్పుతుంది. 
 4) మ్యూచువ‌ల్ ఫండ్స్‌ యూఐడీఏఐ జారీ చేసిన ఆధార్ లెట‌ర్‌, ఈ-ఆధార్‌ను ప్రామాణిక‌మైన‌దిగా అంగీక‌రించాల‌ని సెబీ, ఐఆర్‌డీఏ చాలాకాలం కింద‌టే నిర్ణ‌యించాయి. దీంతో మీకు గుర్తింపు ప‌త్రాల బాధ త‌ప్పుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా, బీమా తీసుకునేందుకు ఈ-ఆధార్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కేవైసీ కోసం అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించ‌వచ్చు. 
 5) నెల‌వారీ పింఛ‌ను పింఛ‌ను అక్ర‌మంగా పొందుతున్న వారిని ఏరివేసేందుకు కేంద్రం కొత్త‌గా ఆధార్ మార్గాన్ని ఎంచుకుంది. ప్ర‌తి నెలా పింఛ‌ను అందుకునేందుకు పింఛ‌నుదార్లు ఆదార్ న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. 6) ప్రావిడెంట్ ఫండ్ 
6) ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ విత్‌డ్రాయ‌ల్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసుకునేందుకు ఆదార్‌ను పీఎఫ్ ఖాతాతో అనుసంధానించాలి. విత్‌డ్రాయ‌ల్స్‌ను వేగ‌వంతం చేసేందుకు చాలా కంపెనీలు ఆధార్‌, పీఎఫ్ అనుసంధానాన్ని ప్రోత్స‌హిస్తున్నాయి. 
7) డిజిట‌ల్ లాక‌ర్ బ్యాంకుల్లో క‌రెంట్ ఖాతా అంటే ఏమిటి? తెర‌వ‌డం ఎలా? బ్యాంకుల్లో క‌రెంట్ ఖాతా అంటే ఏమిటి? తెర‌వ‌డం ఎలా? మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింపు ఎలా లెక్కిస్తారు? మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింపు ఎలా లెక్కిస్తారు? లాభాల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన దేశీయ మార్కెట్లు లాభాల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన దేశీయ మార్కెట్లు Featured Posts 7) డిజిట‌ల్ లాక‌ర్ డిజిట‌ల్ లాకర్ ద్వారా మీ ముఖ్య‌మైన స‌ర్టిఫికెట్ల‌ను ఆన్‌లైన్‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. దీనికి మీ వ‌ద్దే డిజిట‌ల్ కీ (కోడ్) ఉంటుంది. ఇది బ్యాంకు ఏటీఎమ్ పిన్‌లాగే ప‌నిచేస్తుంది. దీనిలో భ‌ద్ర‌ప‌రిచిన ప‌త్రాలకు ఈ-సైన్ చేసి స‌మ‌ర్పించ‌డం ద్వారా స‌మ‌యం ఆదా చేసుకోవ‌చ్చు. ఉప‌కార వేత‌నాలు ఉప‌కార వేత‌నాలు విద్యార్థుల‌కు స‌కాలంలో ఉప‌కార వేత‌నాలు అందించేందుకు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో ఎదుర‌వుతున్న చిన్న చిన్న అవాంత‌రాల‌ను తొల‌గించేందుకు విద్యార్థుల ఉప‌కార వేత‌నాల‌ను సైతం ఆధార్‌తో అనుసంధానించారు. అంటే ప్ర‌తి విద్యార్థి క‌ళాశాల‌లో, వారు చ‌దివే విద్యాల‌యాల్లో బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ సంఖ్య‌ను ఇవ్వాలి. త‌మ బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఖాతాను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానం చేసేలా చూసుకోవాలి. ఆధార్ కార్డులో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకోండిలా... గ్యాస్ స‌బ్సిడీ గ్యాస్ స‌బ్సిడీ ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఆధార్ లేనివారు ఇకనుంచి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ చట్టం ప్రకారం ఈ నిబంధన గ‌తేడాది నుంచి అమ‌ల‌వుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 14.2 కిలోల సిలిండర్లు 12 వరకు సబ్సిడీ కింద సరఫరా చేస్తున్నారు. వీటి సబ్సిడీని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ(డీబీటీ) కింద నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Friday, 13 January 2017

Happy Pongal

Wishing that this festival brings good luck
and prosperity and hoping that it is joyous,
and fills your days ahead with happiness.
Have a wonderful Pongal.

Monday, 9 January 2017

ఖమ్మం జిల్లా కోర్టులో డ్రైవ‌ర్లు (చివరి తేదీ: 28.01.2017)

డ్రైవ‌ర్ ఉద్యోగ‌ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........

డ్రైవ‌ర్: 03 పోస్టులు
అర్హత: తెలుగు, ఉర్దూ/ ఇంగ్లిష్ భాష‌లు చ‌ద‌వ‌డం, రాయ‌డం తెలిసుండాలి. లైట్ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ క‌లిగి ఉండ‌టంతో పాటు మూడేళ్ల ప‌ని అనుభవం అవ‌స‌రం
.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి
.
ఎంపిక: డ్రైవింగ్, మౌఖిక ప‌రీక్షల‌ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి, ఖ‌మ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి
.
చివరి తేదీ: 28.01.2017.

ఖమ్మం జిల్లా కోర్టులో ఎగ్జామినర్ (చివరి తేదీ: 28.01.2017)

ఖమ్మంలోని జిల్లా కోర్టు ఎగ్జామినర్ ఉద్యోగ‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........

ఎగ్జామినర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి
.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి
.
ఎంపిక: రాత, మౌఖిక ప‌రీక్షల‌ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి, ఖ‌మ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి
.
చివరి తేదీ: 28.01.2017.

ఖమ్మం జిల్లా కోర్టులో జూనియ‌ర్ అసిస్టెంట్లు

జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........

జూనియ‌ర్ అసిస్టెంట్: 06 పోస్టులు
అర్హత: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణత‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానంతో పాటు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి
.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి
.
ఎంపిక: రాత‌, మౌఖిక ప‌రీక్షల‌ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి, ఖ‌మ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి
.
చివరి తేదీ: 28.01.2017.

ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫ‌ర్, టైపిస్టు, కాపీస్టు

ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫ‌ర్, టైపిస్టు, కాపీస్టు ఉద్యోగాల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........

1. స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-III: 05 పోస్టులు
అర్హత: ఇంట‌ర్మీడియ‌ట్‌. హ‌య్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ ఉత్తీర్ణులై ఉండాలి
.
2. టైపిస్టు: 03 పోస్టులు

అర్హత: ఇంట‌ర్మీడియ‌ట్‌. హ‌య్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి
.
3. కాపీస్టు: 02 పోస్టులు

అర్హత: ఇంట‌ర్మీడియ‌ట్‌. హ‌య్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం అవ‌స‌రం
.
* అన్ని పోస్టుల‌కు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి
.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి
.
ఎంపిక: రాత‌, ప్రాక్టిక‌ల్, మౌఖిక ప‌రీక్షల‌ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి, ఖ‌మ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి
.
చివరి తేదీ: 28.01.2017.