Friday 9 June 2023

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఫరీదాబాద్‌లో 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు

 

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)… కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. జూనియర్ ఇంజినీర్ (సివిల్): 149 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 74 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 63 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్ (ఇ&సి): 10 పోస్టులు

5. సూపర్‌వైజర్ (ఐటీ): 09 పోస్టులు

6. సూపర్‌వైజర్ (సర్వే): 19 పోస్టులు

7. సీనియర్ అకౌంటెంట్: 28 పోస్టులు

8. హిందీ ట్రాన్స్‌లేటర్‌: 14 పోస్టులు

9. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్): 14 పోస్టులు

10. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్/ మెకానికల్): 08 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయో పరిమితి: 30-06-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్‌కు రూ.29,600 - రూ.1,19,500; హిందీ ట్రాన్స్‌లేటర్‌కు రూ.27,000 - రూ.1,05,000; డ్రాఫ్ట్స్‌మ్యాన్- రూ.25,000-రూ.85,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, దిల్లీ, గ్యాంగ్‌టక్, గువాహటీ, హైదరాబాద్, ఈటానగర్, జైపుర్, జమ్మూ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, రాంచీ.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) కేటగిరీలకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-06-2023.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-06-2023.

No comments:

Post a Comment