Friday 9 June 2023

14 నుంచి పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

 

రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల ఏర్పాటు

11 నుంచి 13వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్‌ లెటర్ల

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను జూన్‌ 14 నుంచి 26 వరకు పరిశీలించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి 18 కేంద్రాల్ని ఎంపిక చేసింది. రోజుకు సగటున దాదాపు 9 వేల మంది చొప్పున మొత్తం 1,09,906 మంది పత్రాల్ని పరిశీలించనున్నారు. జూన్‌ 11న ఉదయం 8 గంటల నుంచి 13న రాత్రి 8 గంటల వరకు అభ్యర్థుల ఇంటిమేషన్‌ లెటర్లను మండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రక్రియ సాగుతుంది ఇలా..

అభ్యర్థులకు కేటాయించిన తేదీన ఉదయం 9 గంటలకు ఆయా కేంద్రంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఇంటిమేషన్‌ లెటర్‌ను తప్పనిసరిగా చూపించాలి. 

దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు నేరుగా పత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. ఒకవేళ సవరణల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకొని ఉంటే ఆ ప్రతిని తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణల్ని మండలివర్గాలు ఆమోదిస్తాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి కొన్ని పోస్టుల్లో అదనపు మార్కులు కలపనున్నట్లు నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు సంబంధిత వివరాలను అందజేయాలి

ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫొటోకాపీలను తీసుకురావాలి. వాటిని పరిశీలించిన అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది.

పరిశీలన కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

యూనిట్‌        కేంద్రం                  అభ్యర్థులు
ఆదిలాబాద్‌        ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌             4918
సైబరాబాద్‌        సైబరాబాద్‌ కమిషనరేట్‌ గ్రౌండ్‌    8509
హైదరాబాద్‌        గోషామహల్‌ స్టేడియం        7459
కరీంనగర్‌        పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌        5814
ఖమ్మం        సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌         6425
కొత్తగూడెం        సీఈఆర్‌క్లబ్‌            4000
మహబూబాబాద్‌       డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌7034
మహబూబ్‌నగర్‌    డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌             4896
నాగర్‌కర్నూల్‌        డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌         3865
గద్వాల్‌        డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌         4967
నల్గొండ        పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌        7480
నిజామాబాద్‌        పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌                 5313
రాచకొండ        సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట    7737
రామగుండం        పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం    6341
సంగారెడ్డి        ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌        7065
సిద్దిపేట        పోలీస్‌ కమిషనరేట్‌               4409
సూర్యాపేట        డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌    5968
వరంగల్‌         పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం    7706

No comments:

Post a Comment