ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ-1 2019 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించి డిసెంబర్ 28, 2020 నుంచి జులై 31, 2021 వరకు 7 విడతల్లో నిర్వహించిన సీబీటీ-1 పరీక్షా ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. 2019లో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 35,208 నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు కోటి మంది అభ్యర్థులు సీబీటీ-1 పరీక్షకు హాజరయ్యారు.
Durect Link :
RRB NTPC CBT-1 results: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1: రైల్వే అధికారిక వెబ్‌సైట్ 'rrbcdg.gov.in'ను ఓపెన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో 'Results' ఫలితాలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3: 'RRB NTPC CBT-1 results' లింకుపై క్లిక్ చేయండి.
Step 4: మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవండి.
Step 5: స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి.
tep 6: తదుపరి అవసరాల కోసం మీ ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్కోర్ కార్డుపై ఈ వివరాలు చెక్ చేసుకోండి :
అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునే సమయంలో స్కోర్ కార్డులో పేర్కొన్న వివరాలు సరిగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ముఖ్యంగా పేరు, స్పెల్లింగ్ ఎర్రర్స్, క్వాలిఫయింగ్ స్టేటస్, మార్కులు, నార్మలైజ్డ్ స్కోర్, రిజిస్ట్రేషన్ నంబర్.. ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా పరిశీలించండి.
క్వాలిఫై అయినవారికి సీబీటీ-2
సీబీటీ-1లో క్వాలిఫై అయిన అభ్యర్థులు సీబీటీ-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. సీబీటీ-2లో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమేటిక్స్, జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 మధ్యన ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment