Monday 20 April 2020

కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?

కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?



తెలియని వారిని తాకకూడదు..
మనకు తెలియని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయకూడదు..
ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు : అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి కారకాలు.. ఒకర నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదు..
ఎప్పుడు మాస్క్ ధరించాలి : చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
అన్నింటికంటే ముఖ్యం.. ముందుగానే వైద్యులను సంప్రదించడం లేకపోతే వ్యాధి తీవ్రతరమై ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. అలాంటి పరిస్థితుల రాకముందే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.
కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించొచ్చు. * ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. * నీరు ఎక్కువగా తాగుతుండాలి.



No comments:

Post a Comment