Monday, 20 April 2020

కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?

కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?



తెలియని వారిని తాకకూడదు..
మనకు తెలియని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయకూడదు..
ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు : అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి కారకాలు.. ఒకర నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదు..
ఎప్పుడు మాస్క్ ధరించాలి : చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
అన్నింటికంటే ముఖ్యం.. ముందుగానే వైద్యులను సంప్రదించడం లేకపోతే వ్యాధి తీవ్రతరమై ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. అలాంటి పరిస్థితుల రాకముందే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.
కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించొచ్చు. * ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. * నీరు ఎక్కువగా తాగుతుండాలి.



Saturday, 18 April 2020

మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేస్కొండిలా....!!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.1,500 చొప్పున జమ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షల అకౌంట్లలో నగదు జమ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తమ అకౌంట్లలో రూ.1,500 జమ అవుతాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు. మరి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.


లేదా డైరెక్ట్ లింక్ :