Friday 2 November 2018

ఏపీలో 334 సివిల్‌ ఎస్సై, ఆర్‌ఎస్సై పోస్టులు(చివ‌రితేది: 24.11.2018)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హోంశాఖ పరిధిలో ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.పోస్టుల వివరాలు...1. సివిల్‌ ఎస్సై (మహిళలు, పురుషులు): 150
2.
ఏఆర్‌ ఆర్‌ఎస్సై (మహిళలు, పురుషులు): 75
3.
ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై (పురుషులు): 75
4.
డిప్యూటీ జైలర్‌ (పురుషులు): 10
5.
డిప్యూటీ జైలర్‌ (మహిళలు): 4
6.
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (పురుషులు): 20మొత్తం పోస్టులు: 334.వయోపరిమితి, విద్యార్హతలు:* సివిల్‌ ఎస్సై, ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై: 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి.
*
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ (పురుషులు): 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికీ డిగ్రీ కావాలి.
*
డిప్యూటీ జైలర్‌(పురుషులు): 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులే అర్హులు.
*
డిప్యూటీ జైలర్‌ (మహిళలు): 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత కావాలి.
*
ఎంపిక‌: ప్రాథమిక(పేప‌ర్ 1,2), దేహదారుఢ్య(పీఎంటీ, పీఈటీ), ప్ర‌ధాన‌ పరీక్షలు, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.
*
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు: రూ.300
*
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్ర్రక్రియ తేదీలు: న‌వంబ‌ర్ 5 నుంచి 24 వరకు.
*
ప్రాథమిక పరీక్ష తేదీ: 16.12.2018.
 
 

No comments:

Post a Comment