| ||||
Friday, 16 November 2018
ఈఎస్ఐసీలో 79 జూనియర్ ఇంజినీర్ పోస్టులు (చివరి తేది: 15.12.18)
Thursday, 15 November 2018
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఖాళీలు (చివరి తేది: 15.11.18)
| ||||
Tuesday, 13 November 2018
ఏపీలో 2,723 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టులు (చివరితేది: 07.12.2018)
| |
Friday, 2 November 2018
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 107 పోస్టులు
ఎన్‌టీపీసీ
లిమిటెడ్ (ఈస్ట్రన్ రీజియన్) పరిధిలోని దారిపల్లి సూపర్ థర్మల్ పవర్
స్టేషన్ (సుందర్‌గఢ్ జిల్లా-ఒడిశా)లో 107 ట్రైయినీ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: డిప్లొమా ఇంజనీర్-55, ఐటీఐ/ల్యాబ్ అసిస్టెంట్/అసిస్టెంట్-52.
విభాగాలు: మెకానికల్,
ఎలక్ట్రికల్, సీఅండ్‌ఐ, సివిల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్
మెకానిక్, కెమిస్ట్రీ, మెటీరియల్స్/స్టోర్ కీపర్.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్ టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: పోస్టును బట్టి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 24, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.ntpccareers.net
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.ntpccareers.net
3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది.
ఈ
మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్
రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ నవంబర్ 1న ఒక ప్రకటనలో
తెలిపారు. http://slprb.ap.gov.in
వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఐ,
ఆర్‌ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 5వ తేదీ నుంచి 24వ తేదీ లోగా,
కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్‌మెన్ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ
తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయస్సు ధృవీకరణ,
విద్యార్హత, శరీర కొలతలకు సంబంధించి ధృవపత్రాలు దరఖాస్తుతోపాటు
ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్,
డెప్యూటీ జైలర్ పోస్టులకు ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 వంతున
ఫీజు చెల్లించాలి. వీరికి డిసెంబర్ 16వ తేదీ ప్రాథమిక పరీక్ష ఉంటుంది.
పోలీస్ కానిస్టేబుల్, వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు
రూ.300, ఎస్సీ, ఎస్టీ పోస్టులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
వీరికి 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో
ఎస్‌ఐ(సివిల్) 150, ఆర్‌ఎస్‌ఐ(ఏఆర్) 75, ఆర్‌ఎస్‌ఐ(ఏపీఎస్‌పీ) 75, స్టేషన్
ఫైర్ ఆఫీసర్ 20, డెప్యూటీ జైలర్(మెన్) 10, డెప్యూటీ జైలర్(ఉమెన్) 4,
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 50, పోలీస్ కానిస్టేబుల్(సివిల్) 1600,
కానిస్టేబుల్(ఏఆర్) 300, పోలీస్ కానిస్టేబుల్(ఏపీఎస్‌పీ) 300,
వార్డర్(మేల్) 100, వార్డర్(ఉమెన్) 23, ఫైర్‌మెన్ 400, డ్రైవర్ ఆపరేటర్స్
30 పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 17 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు
సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా
దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్
బోర్డు అక్టోబర్ 27న విడుదల చేసింది.
రాతపరీక్షలో
అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.
మొత్తం 40 రోజుల పాటు ఫిజికల్ మెజర్‌మెంట్స్ (పీఎంటీ), ఫిజికల్
ఎఫిషియెన్సీ(పీఈటీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తో
పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు బోర్డు
అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పార్ట్-2
దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చైర్మన్ చెప్పారు. అక్టోబర్ 29 నుంచి
నవంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డుకు
సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ ద్వారా
తెలియజేస్తామని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో
పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, కులధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్
కోటా సర్టిఫికెట్, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేయాలని పేర్కొన్నారు.
లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని తెలిపారు.
మొత్తం 3,77,770 మంది..
సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొత్తం 3,77,770 మంది..
సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
విభాగం | అభ్యర్థులు |
సబ్‌ఇన్‌స్పెక్టర్, తదితర పోస్టులు | 1,10,635 |
ఐటీ, కమ్యూనికేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ | 4,684 |
అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఫింగర్ ప్రింట్) | 3,276 |
సివిల్ కానిస్టేబుల్ | 2,28,865 |
ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ | 14,981 |
కానిస్టేబుల్(డ్రైవర్ విభాగం) | 13,458 |
కానిస్టేబుల్(మెకాానిక్ విభాగం) | 1,871 |
మొత్తం | 3,77,770 |
Subscribe to:
Posts (Atom)