Wednesday 27 September 2017

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు

తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్).. 750 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాగా, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల అభ్యర్థులకూ అవకాశం ఉంది.
పోస్టు పేరు-ఖాళీలవివరాలు...
కార్మిక శ్రేణి విభాగంలో..
పోస్టులు
సంఖ్య
ఫిట్టర్ ట్రైనీ
288
ఎలక్ట్రీషియన్ ట్రైనీ
143
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ
69
టర్నల్/మెషినిస్ట్ ట్రైనీ
51
సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్)
35
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)
24
మౌల్డర్ ట్రైనీ
24
మోటార్ మెకానిక్ ట్రైనీ
8
మౌల్డర్
1
అధికార శ్రేణి కేటగిరీలో.. మేనేజ్‌మెంట్ ట్రైనీ...
ఈఅండ్‌ఎం
68
మైనింగ్
37
హైడ్రో జియాలజిస్టు
1
జియో ఫిజిస్ట్
1

Education Newsఅర్హతలు: ఎగ్జిక్యూటివ్ కేడర్‌లోని మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగాలను అనుసరించి బీఈ/బీటెక్/ఏఎంఐఈ లేదా తత్సమాన విద్యార్హత/ఎంఎస్సీ(టెక్) హైడ్రోజియాలజీ/ ఎంఎస్సీ(అప్లైడ్ జియాలజీ/జియాలజీ/జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్)/ ఎంటెక్ (జియో ఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణత. దీంతోపాటు నిబంధనల మేర మార్కుల శాతం నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లోని పోస్టులకు సంబంధిత విభాగాలను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ, ఎన్‌సీటీవీటీ సర్టిఫికెట్/ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/సివిల్/మెటలర్జీ).
వయోపరిమితి: 2017 సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ఫీజు: రూ.200; ఎస్సీ/ఎస్టీ/ఇంటర్నల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.scclmines.com

No comments:

Post a Comment