Thursday, 27 July 2017

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)-హైదరాబాద్‌లో 271 ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ప్రాంతీయ కార్యాలయం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్‌లోని ఎఫ్‌సీఐ కార్యాలయాల్లో వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Jobsపోస్టు పేరు: వాచ్‌మెన్.
మొత్తం ఖాళీలు: 271 (అన్‌రిజర్వుడ్-138, ఓబీసీ-73, ఎస్సీ-41, ఎస్టీ-19).
ప్రాంతాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-158 (అన్‌రిజర్వుడ్-79, ఓబీసీ-43, ఎస్సీ-25, ఎస్టీ-11); తెలంగాణ-101 (అన్‌రిజర్వుడ్-51, ఓబీసీ-27, ఎస్సీ-16, ఎస్టీ-7); అండమాన్ నికోబార్-12 (అన్‌రిజర్వుడ్-8, ఓబీసీ-3, ఎస్టీ-1).
వేతనం: రూ.8,100-రూ.18,070.
విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017, జూలై నాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ దివ్యాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ దివ్యాంగులకు13 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ (దేహ దారుఢ్య పరీక్ష).
పరీక్ష విధానం: రాత పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో వేర్వేరుగా ఉంటుంది. అభ్యర్థి తనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. రాతపరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో 120 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల్లో ఒక్కో అంశం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుంచి మెరిట్ జాబితా తయారుచేసి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ): పరుగుపందెం - 5 నిమిషాల 30 సెకన్లలో పురుషులు 1000 మీటర్ల దూరాన్ని; మహిళలు 800 మీటర్ల దూరాన్ని చేరుకోగలగాలి. హైజంప్- పురుషులు 1.20 మీటర్ల ఎత్తును, మహిళలు 0.80 మీటర్ల ఎత్తును అధిగమించాలి; లాంగ్‌జంప్- పురుషులు 3.50 మీటర్లు, మహిళలు 3 మీటర్ల దూరం దూకగలగాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉండదు.
దృష్టి సామర్థ్యం: అభ్యర్థులకు ఎఫ్‌సీఐ నిబంధనలను అనుసరించి తగిన దృష్టి సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.fciregionaljobs.com

No comments:

Post a Comment