Friday, 10 March 2017

బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు



తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహిస్తున్న బాలురు, బాలికల జూనియర్ కళాశాలతోపాటు బాలికల డిగ్రీ కళాశాలలో ఫస్టియర్‌లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
Education Newsకోర్సులు-గ్రూపులు: జూనియర్ కాలేజీల్లో కోర్సులు-ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. డిగ్రీ కాలేజీలో కోర్సులు-బీఎస్సీ (ఎంపీసీ, ఎంఎస్‌సీఎస్-మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బీజెడ్‌సీ); బీఏ (హెచ్‌ఈపీ-హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), బీకాం (జనరల్, కంప్యూటర్స్).
విద్యార్హత: ఇంటర్‌లో ప్రవేశానికి.. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు; డిగ్రీలో ప్రవేశానికి.. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.150
ఇంటర్ దరఖాస్తుకు చివరి తేది : ఏప్రిల్ 5, 2017
డిగ్రీ దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 6, 2017
ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 23, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: mjptbcwreis.cgg.gov.in

No comments:

Post a Comment