Saturday 7 January 2017

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు /విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్ నియామకానికి ప్రకటన జారీ చేసింది.
Jobsఖాళీల వివరాలు...
ఆంధ్రప్రదేశ్ :
125 (ఓసీ-58, ఓబీసీ-48, ఎస్సీ-7, ఎస్టీ-12). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-3.
తెలంగాణ : 127 (ఓసీ-66, ఓబీసీ-34, ఎస్సీ-11, ఎస్టీ-16). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-2.
వేతనం: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800.
విద్యార్హత: 2017 ఆగస్టు 1 నాటికి పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 2017 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్లు. రిజర్వేషన్, ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, పేపర్-2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
పేపర్-1: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు; జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పేపర్-1లో ఉత్తీర్ణులైనవారినే పేపర్-2కి అనుమతిస్తారు.
పేపర్-2: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్ధ గంట (30 నిమిషాల) వ్యవధిలో షార్ట్ ఎస్సే/లెటర్ రాయాలి. లెటర్‌ను ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు.
తుది ఎంపిక: పేపర్-2లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేపర్-1 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30 సాయంత్రం 5 గంటలు.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16, 30; మే 7
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: ssconline.nic.in

No comments:

Post a Comment