ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదేండ్ల
(స్థిరకాల ఒప్పందంపై) వరకు ఏ-320 ఎండార్స్‌మెంట్ సీనియర్ ట్రెయినీ పైలట్స్
(పీ-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఏఐఎల్ ఎయిర్ ఇండియా పరిధిలో పని చేస్తున్న అనుబంధ సంస్థ
పోస్టు పేరు: సీనియర్ ట్రెయినీ పైలట్స్ (ఏ-320 ఎండార్స్‌మెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 415 (జనరల్ -116, ఎస్సీ-63, ఎస్టీ-45, ఓబీసీ-191)
అర్హత:
గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన స్థాయిలో
ఉత్తీర్ణత. డీజీసీఏ ఇండియా జారీచేసిన, వినియోగంలో ఉన్న సీపీఎల్/ఏటీపీఎల్,
ఎఫ్‌ఆర్‌టీవో, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఏ-320 ఎయిర్‌క్రాఫ్ట్
సీపీఎల్/ఏఎల్‌టీపీ లైసెన్స్ కలిగి ఉండాలి. డబ్ల్యూపీసీ మినిస్ట్రీ ఆఫ్
కమ్యూనికేషన్ జారీచేసిన ఆర్‌టీఆర్ (ఏ/బీ, సీ), వ్యాలిడ్ ఈఎన్‌పీ
(సీపీఎల్/ఏటీపీఎల్)
లైసెన్స్ కలిగి ఉండాలి
వయస్సు : 2016 ఆగస్టు 1
నాటికి 40 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ
అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్:
శిక్షణ సమయంలో నెలకు రూ. 25,000లు స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. శిక్షణను
విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు రూ. 80,000/-, అదనంగా ఫ్లయింగ్
అలవెన్స్‌లు గంటకు రూ.15,00-4,500 (ఫ్లయింగ్ అవర్స్ నెలకు 70 గంటలు
దాటకుండా) ఒకవేళ దాటితే ఓవర్‌టైమ్ కింద గంటకు రూ. 2000-5300 అలవెన్స్‌లు
ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 3000/- (ఎయిర్ ఇండియా లిమిటెడ్ పేరు మీద ఢిల్లీలో చెల్లే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్‌ను తీయాలి)
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక:
అప్లికేషన్ స్క్రూటిని తర్వాత క్వాలిఫయింగ్ టెస్ట్‌లో భాగంగా సైకోమెట్రిక్
టెస్ట్ ఉంటుంది. దీనిని ఢిల్లీ/ముంబై, ఇతర నగరాల్లో నిర్వహిస్తారు. ఇందులో
అర్హత పొందిన అభ్యర్థులు సిమ్యులేటర్ ప్రొఫిషియెన్సీ అసెస్‌మెంట్ చెక్
(ఎస్‌పీఏసీ) కోసం హైదరాబాద్‌లోని ఏ-320 సిమ్యులేటర్, సెంట్రల్ ట్రెయినింగ్
ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిర్ ఇండియా లిమిటెడ్‌లో నిర్వహిస్తారు.
సిమ్యులేటర్‌ను
చెక్ చేయటానికి ఎయిర్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ పేరు మీద రూ. 25,000/-
డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్‌పీఏసీని పూర్తి చేసిన వారిని ఫైనల్
మెరిట్‌లిస్ట్‌లోకి పరిగణిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి
దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి, విద్యార్హత,
అకడమిక్/టెక్నికల్ సర్టిఫికెట్‌లు, ఎక్స్‌పీరియన్స్,
ఎండార్స్‌మెంట్/లైసెన్స్‌లను అటెస్టెడ్ కాపీలతో సంబంధిత పర్సనల్ అధికారికి
పంపాలి.
చిరునామా: General Manager (Personnel),
AirIndia Limited, Headquarters
Airlines House, 113,
Gurudwara Rakab Ganj Road,
NewDelhi-110001
వెబ్‌సైట్: www.airindia.in/careers.htm