Tuesday, 18 September 2018

అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు సంబంధించి బీఏ/ బీకాం/ బీఎస్సీ, సెకెండ్‌ స్పెల్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు సోమవారం (సెప్టెంబరు 17) ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు  అక్టోబరు22 నుంచి ప్రారంభమవుతాయని వారు తెలిపారు.

ఇక తృతీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 22 నుంచి 27 వరకు,
 ద్వితీయ సంవత్సరానికి అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు,
ప్రథమ సంవత్సర పరీక్షలు నవంబరు 5 నుంచి 9 వరకు ఉంటాయన్నారు.

వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చని సూచించారు.
https://www.braouonline.in/

Sunday, 16 September 2018

Telangana SI Results ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌సీటీ సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్), తత్సమాన పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో మొత్తం 1,10, 635 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులే ఉండటం విశేషం. ఆగస్టు 26న తెలంగాణ వ్యాప్తంగా ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహిాంచారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.....


https://www.tslprb.in/Account/Login
 


పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,88,482 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన 'కీ' ని ఆగస్టు 27న విడుదల చేశారు. ఆగస్టు 29 వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదలచేశారు.

ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి మూడు దశల నియామక ప్రక్రియలో భాగంగా ఈ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రెండో దశలో ఈవెంట్స్ ఉంటాయి. అందులోనూ క్వాలిఫై అయిన వారికి తుది దశలో మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఐబీపీఎస్ సీఆర్‌పీ క్ల‌ర్క్స్ VIII - 7275 ఖాళీలు (చివ‌రితేది: 10.10.2018)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్కు పోస్టుల భ‌ర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-VIII ద్వారా దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* ఐబీపీఎస్ సీఆర్‌పీ క్ల‌ర్క్స్ VIIIమొత్తం పోస్టుల సంఖ్య‌: 72751) తెలంగాణ‌లో 162 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు: అల‌హాబాద్ బ్యాంకు-20, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-06, కెన‌రా బ్యాంక్‌-60, కార్పొరేష‌న్ బ్యాంక్‌-07, ఇండియ‌న్ బ్యాంక్‌-15, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-05, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-20, విజ‌యా బ్యాంక్‌-08.2) ఏపీలో 167 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు: అల‌హాబాద్ బ్యాంకు-15, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-16, బ్యాంక్ ఆఫ్ ఇండియా-09, కార్పొరేష‌న్ బ్యాంక్‌-10, ఇండియ‌న్ బ్యాంక్‌-52, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-10, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-39, విజ‌యా బ్యాంక్‌-08.అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. అభ్య‌ర్ధి ద‌ర‌ఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన‌ ప్రాంతీయ భాష‌లో రాయడం, చ‌ద‌వ‌డం, మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.వయసు: 01.09.2018 నాటికి 20-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా.ప‌రీక్ష విధానం: * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో మొత్తం 100 మార్కుల‌కు 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఇంగ్లిష్‌-30, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ-35, రీజనింగ్ ఎబిలిటీ-35 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం 1 గంట‌.* మెయిన్ ప‌రీక్ష‌లో మొత్తం 190 ప్ర‌శ్న‌ల‌కు గాను 200 మార్కులు ఉంటాయి. ఇందులో జ‌న‌ర‌ల్‌/ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌-50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్- 40 ప్ర‌శ్న‌ల‌కు 40 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & కంప్యూట‌ర్ అప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌ల‌కు 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు ఉంటాయి. ప‌రీక్ష స‌మ‌యం 160 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు
:
ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు రూ.100, ఇత‌రుల‌కు రూ.600.ముఖ్యమైన తేదీలు...* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్ర‌క్రియ‌ ప్రారంభం: 18.09.2018.* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపున‌కు చివరితేది: 10.10.2018.* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు, 2018. * ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ప‌రీక్ష‌ తేది: 26.11.2018 - 01.12.2018.* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు, 2018. * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) తేదీ: 2018 డిసెంబ‌రు 8, 9, 15, 16 తేదీల్లో. * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) ఫ‌లితాలు: డిసెంబ‌రు 2018/ జ‌న‌వ‌రి 2019.* మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి, 2019. * మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) తేది: 20.01.2019.* ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌: ఏప్రిల్ 2019.



TSPSC VRO Examination Key Paper 2018 || వీఆర్వో 2018 పరీక్షా జవాబు పత్రం

VRO Key Paper || వీఆర్వో పరీక్ష సమాధానాలు 2018

TSPSC- VRO- 2018





TSPSC VRO Examination Question Paper 2018 || వీఆర్వో 2018 పరీక్షా ప్రశ్న...

VRO Question Paper || వీఆర్వో పరీక్ష ప్రశ్న పత్రం 2018

VRO Exam Today in Telangana



VRO Question Paper Booklet Code C

Download Here !!!
https://drive.google.com/open?id=115gl2tjIuSV2RJiv5nXt4noTIHjEii35

Download Here !!!

Saturday, 15 September 2018

కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు

బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వివ‌రాలు......
1) కానిస్టేబుల్ (జీడీ)
2) రైఫిల్‌మ‌న్ (జీడీ)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 54,953 (పురుషుల‌కు 47,307; మ‌హిళ‌ల‌కు 7,646) విభాగాల‌వారీ ఖాళీలు: బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)-16984, సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)-200, సెంట్ర‌ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)-21566, స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)-3076, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌)-447. అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. వ‌య‌సు: 2018 ఆగ‌స్టు 1 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ ద్వారా. ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఎలిమెంట‌రీ మ్యాథ‌మేటిక్స్‌, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మొత్తం మార్కులు వంద‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. గంట‌న్న‌ర స‌మ‌యంలో స‌మ‌ధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 17.08.2018 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2018

Wednesday, 12 September 2018