Wednesday, 2 August 2017

రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఉద్యోగాలు

రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఖాళీల భర్తీకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా- రిక్రూట్‌మెంట్ సెల్ ప్రకటన వెలువడింది.
Jobsపోస్టుల పేరు-ఖాళీలు: పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్(ఇంగ్లిష్/హిందీ-1 + ఒడియా-1)-2; అసిస్టెంట్ లెజిస్లేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-20; స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)-11; సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2)-21; సెక్రెటేరియట్ అసిస్టెంట్(ఇంగ్లిష్-30 + హిందీ-7 + ఉర్దూ-2)-39; ట్రాన్స్‌లేటర్-19; ప్రూఫ్ రీడర్-3.
వేతనం: పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్ పోస్టులకు రూ.15,600-రూ.39,100; అసిస్టెంట్ లెజిస్టేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్), సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2), ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు రూ.9,300-రూ.34,800; మిగిలిన పోస్టులకు రూ.5,200-రూ.20,200.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా. దీంతోపాటు నిబంధనల మేర కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్, ఉద్యోగానుభవం, టైపింగ్ తదితరం ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే నాటికి పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు 18-35 ఏళ్ల లోపు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ...
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 18, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: http://rajyasabha.nic.in , http://parliamentofindia.nic.in

Thursday, 27 July 2017

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)-హైదరాబాద్‌లో 271 ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ప్రాంతీయ కార్యాలయం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్‌లోని ఎఫ్‌సీఐ కార్యాలయాల్లో వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Jobsపోస్టు పేరు: వాచ్‌మెన్.
మొత్తం ఖాళీలు: 271 (అన్‌రిజర్వుడ్-138, ఓబీసీ-73, ఎస్సీ-41, ఎస్టీ-19).
ప్రాంతాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-158 (అన్‌రిజర్వుడ్-79, ఓబీసీ-43, ఎస్సీ-25, ఎస్టీ-11); తెలంగాణ-101 (అన్‌రిజర్వుడ్-51, ఓబీసీ-27, ఎస్సీ-16, ఎస్టీ-7); అండమాన్ నికోబార్-12 (అన్‌రిజర్వుడ్-8, ఓబీసీ-3, ఎస్టీ-1).
వేతనం: రూ.8,100-రూ.18,070.
విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017, జూలై నాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ దివ్యాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ దివ్యాంగులకు13 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ (దేహ దారుఢ్య పరీక్ష).
పరీక్ష విధానం: రాత పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో వేర్వేరుగా ఉంటుంది. అభ్యర్థి తనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. రాతపరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో 120 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల్లో ఒక్కో అంశం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుంచి మెరిట్ జాబితా తయారుచేసి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ): పరుగుపందెం - 5 నిమిషాల 30 సెకన్లలో పురుషులు 1000 మీటర్ల దూరాన్ని; మహిళలు 800 మీటర్ల దూరాన్ని చేరుకోగలగాలి. హైజంప్- పురుషులు 1.20 మీటర్ల ఎత్తును, మహిళలు 0.80 మీటర్ల ఎత్తును అధిగమించాలి; లాంగ్‌జంప్- పురుషులు 3.50 మీటర్లు, మహిళలు 3 మీటర్ల దూరం దూకగలగాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉండదు.
దృష్టి సామర్థ్యం: అభ్యర్థులకు ఎఫ్‌సీఐ నిబంధనలను అనుసరించి తగిన దృష్టి సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.fciregionaljobs.com

Tuesday, 18 July 2017

ఇండియ‌న్ ఆర్మీలో 142 ఖాళీలు

ఇండియ‌న్ ఆర్మీలో 142 ఖాళీలు

Image result for indian army logoఇండియ‌న్ ఆర్మీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....
* ఖాళీల సంఖ్య: 1421) మెటీరియ‌ల్ అసిస్టెంట్‌: 062) ఎల్డీసీ: 013) ఫార్మసిస్ట్‌: 014) టెలీ ఆప‌రేట‌ర్‌-II: 015) ఫైర్‌మ్యాన్‌: 366) ట్రేడ్స్‌మ్యాన్ (మేట్‌): 947) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 018) ధోబీ: 019) టైల‌ర్‌: 01అర్హత‌: పోస్టుల వారీగా ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఇంట‌ర్, ప‌దోత‌ర‌గ‌తి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు పాటించాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.ఎంపిక విధానం: ఫిజిక‌ల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ద్వారా.ప్రక‌ట‌న తేది: 14.07.2017.చివ‌రితేది: ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్ ప‌త్రిక‌లో ఉద్యోగ ప్రక‌ట‌న ప్రచురిత‌మైన నాటినుంచి 21 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రిమోట్ ప్రాంతాల‌వారు 28 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. (04.08.2017, 11.08.2017)చిరునామా: Commandant 21 Field Ammunition Depot, PIN 909721, C/o 56 APO

Notification
http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16591/ARMY-142-N.pdf 

Application
http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16591/ARMY-142-APP.pdf