Monday 23 September 2024

SSC Constable: 39481 Jobs

 

SSC Constable: కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.
     
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా; తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కేటగిరీ వారీ ఖాళీల వివరాలు...
* కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), సిపాయి: 39,481 పోస్టులు
* పురుషులు: ఎస్సీ- 5254; ఎస్టీ- 4021; ఓబీసీ- 7747; ఈడబ్ల్యూఎస్‌- 3496; యూఆర్‌- 15094 (మొత్తం- 35,612)
* మహిళలు: ఎస్సీ- 564; ఎస్టీ- 433; ఓబీసీ- 829; ఈడబ్ల్యూఎస్‌- 355; యూఆర్‌- 1688 (మొత్తం- 3869)
విభాగాల వారీ ఖాళీలు:
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌): 15654 పోస్టులు (పురుషులు- 13306 ; మహిళలు- 2348)
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌): 7145 పోస్టులు (పురుషులు- 6430; మహిళలు- 715)
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌): 11541 పోస్టులు (పురుషులు- 11299; మహిళలు- 242)
4. సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ): 819 పోస్టులు (పురుషులు- 819; మహిళలు- 0)
5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 3017 పోస్టులు (పురుషులు- 2564; మహిళలు- 453)
6. అస్సాం రైఫిల్స్(ఏఆర్‌): 1248 పోస్టులు (పురుషులు- 1148; మహిళలు- 100)
7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌): 35 పోస్టులు (పురుషులు- 35; మహిళలు- 0)
8. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ): 22 పోస్టులు (పురుషులు- 35; మహిళలు- 11)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.
వయోపరిమితి: జనవరం 01, 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2002 కంటే ముందు, 01-01-2007 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: పే లెవెల్‌-1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ.18,000- రూ.56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌-3 కింద రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌/ హిందీ (20 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
దరఖాస్తు రుసుము: రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:  05.09.2024 నుంచి 14.10.2024 వరకు.
* ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 14-10-2024.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15-10-2024.
* దరఖాస్తు సవరణ తేదీలు: 05.11.2024 నుంచి 07.11.2024 వరకు.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: జనవరి/ ఫిబ్రవరి, 2025.

 

No comments:

Post a Comment