TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్- తెలంగాణ(దోస్త్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6న ప్రారంభం కానుంది. ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలుగా జరగనుంది. జులై 8న తరగతులు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ కాలపట్టికను విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ.
కోర్సు వివరాలు...
* రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
దోస్త్ కాలపట్టిక...
మొదటి విడత
రిజిస్ట్రేషన్: మే 6 నుంచి 25 వరకు(రూ.200 రుసుం)
వెబ్ ఆప్షన్లు: మే 15 నుంచి 27 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 3న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 4 నుంచి 10 వరకు.
రెండో విడత
రిజిస్ట్రేషన్: జూన్ 4 నుంచి 13 వరకు(రూ.400 రుసుం)
వెబ్ ఆప్షన్లు: జూన్ 4 నుంచి 14 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 18న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 19 నుంచి 24 వరకు
మూడో విడత
రిజిస్ట్రేషన్: జూన్ 19 నుంచి 25 వరకు(రూ.400 రుసుం)
వెబ్ ఆప్షన్లు: జూన్ 19 నుంచి 26 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 29న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 29 నుంచి జులై 3 వరకు
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్(3 విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినవారికి): జూన్ 29 నుంచి జులై 5 వరకు.
ఓరియంటేషన్ కార్యక్రమం: జులై 1 నుంచి 6 వరకు.
తరగతుల ప్రారంభం: జులై 8న
No comments:
Post a Comment