* టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా నియామకం
* దరఖాస్తు ఫీజు లేదు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(రాయ్‌పూర్)లో 1,113; సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(బిలాస్‌పుర్)లో 733; రైల్ కోచ్ ఫ్యాక్టరీ (కపుర్తలా)లో 550; చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (చిత్తరంజన్)లో 492 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇటీవల ప్రకటనలు విడుదలయ్యాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు లేదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు.
No comments:
Post a Comment