Saturday, 27 April 2024
Thursday, 25 April 2024
తెలంగాణా హైకోర్టు జాబ్స్
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా హైకోర్టు నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 150 Civil జడ్జి పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు లా డిగ్రా విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 18th April తేదీ నుండి 17th మే తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
కర్ణాటక సర్కిల్ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, కర్ణాటక సర్కిల్… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కర్ణాటక పోస్టల్ రీజియన్లు: ఎన్‌కే రీజియన్, బీజీ (హెచ్‌క్యూ) రీజియన్, ఎస్‌కే రీజియన్.
ఖాళీల వివరాలు:
* స్టాఫ్ కార్ డ్రైవర్: 27 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెచ్‌ఎంవీ)లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2024.
Tuesday, 23 April 2024
MJPTBCWREIS Intermediate and TGRDC Degree Hall tickets Download
MAHATMA JYOTHIBA PHULE TELANGANA BACKWARD CLASSES WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY
Hall tickets Download Here....
Government of Telangana
TGRDC CET-2024 Hall tickets Download Here....
Tuesday, 9 April 2024
ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024
SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు…
ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్- 2024
ఖాళీలు: 3,712.
1. లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
2. డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
3. డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
జీతభత్యాలు:
* ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.
* డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎకు రూ.29,200-92,300.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం: టైర్-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్(బేసిక్ అరిథ్‌మెటిక్ స్కిల్స్), జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 08-04-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07-05-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 10-05-2024 నుంచి 11-05-2024 వరకు.
టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: జూన్-జులైలో నిర్వహిస్తారు
టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
Sunday, 7 April 2024
IGRUA: ఐజీఆర్‌యూఏలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్
యూపీ రాష్ట్రం అమేథీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ… సెప్టెంబర్ 2024 సెషన్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అవివాహిత అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
ప్రోగ్రామ్ వివరాలు:
* కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) ప్రోగ్రామ్: 125 సీట్లు
కోర్సు వ్యవధి: 24 నెలలు.
అర్హత: కనీసం 45% మార్కులతో 10+2 (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కనీసం 158 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వయోపరిమితి: 17 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వైవా/ ఇంటర్వ్యూ, ఆప్టిట్యూడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
శిక్షణ ఫీజు: రూ.45 లక్షలు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 24-05-2024.
ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 03-06-2024.
ఇంటర్వ్యూ/ వైవా ప్రారంభం: 16-07-2024.
తుది ఫలితాల వెల్లడి: 26-08-2024 తర్వాత.
జాయినింగ్ తేదీ: 25-09-2024.
2,888 రైల్వే ఖాళీలకు ప్రకటనలు
* టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా నియామకం
* దరఖాస్తు ఫీజు లేదు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(రాయ్‌పూర్)లో 1,113; సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(బిలాస్‌పుర్)లో 733; రైల్ కోచ్ ఫ్యాక్టరీ (కపుర్తలా)లో 550; చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (చిత్తరంజన్)లో 492 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇటీవల ప్రకటనలు విడుదలయ్యాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు లేదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు.