Thursday, 22 August 2024
త్వరలో 11 వేల అంగన్‌వాడీ ఖాళీల భర్తీ
త్వరలో 11 వేల అంగన్‌వాడీ
ఖాళీల భర్తీ
·
అర్హతలు ఇవే..
·
మార్గదర్శకాల జారీకి కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న మహిళలకు
శుభవార్త. త్వరలో 11 వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ
చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. అలాగే 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే (నర్సరీ) స్కూళ్లు ప్రారంభించనున్నట్లు
ఆమె వెల్లడించారు. ఇటీవల ‘ఈటీవీ భారత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సీతక్క
మాట్లాడుతూ తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను వివరించారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ నియామకాలపై స్పష్టతనిచ్చారు.
రాష్ట్రంలో
35,700 అంగన్‌వాడీ కేంద్రాలు
అంగన్‌వాడీల్లో
11 వేల ఖాళీలను గుర్తించామని.. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో 35,700 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని కోసం
అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన,
ఇతర
అంశాలపై శిక్షణ ఇచ్చామని.. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే
నిర్వహిస్తామని మంత్రి సీతక్క వివరించారు. ఈ మేరకు త్వరలో నియామకాలకు సంబంధించి
మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
పోస్టులు:
1. మెయిన్ అంగన్‌వాడీ టీచర్
2. మినీ అంగన్‌వాడీ టీచర్
3. అంగన్‌వాడీ హెల్పర్
అర్హతలు
ఇవీ..
* టీచర్‌తో పాటు హెల్పర్లుగా
ఎంపికయ్యేవారు కనీసం పదోతరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* జనరల్, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 21 నుంచి 35;
ఎస్సీ/
ఎస్టీ అభ్యర్థులకు 18- 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* స్థానిక
స్థిర నివాసం కలిగి వివాహిత మహిళలై ఉండాలి.
జీత భత్యాలు: అంగన్‌వాడీ టీచర్‌కు రూ.12,500-రూ.13,500. హెల్పర్‌కు రూ.8,000.
ఎంపిక
విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా
ఉంటుంది.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాలి.
ముఖ్య
గమనిక: అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో ప్రభుత్వ
నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది. త్వరలో విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలపై
అధికారికంగా స్పష్టత రానుంది. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఈ అంశాలపై స్పష్టత
వచ్చే అవకాశం ఉంది.