Wednesday, 2 November 2022
Friday, 28 October 2022
భారత నౌకాదళంలో 217 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు
Navy: భారత నౌకాదళంలో 217 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం... షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ) జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.
బ్రాంచి/ కేడర్ వివరాలు…
ఎగ్జిక్యూటివ్ బ్రాంచి:
1. జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్: 56 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 05 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 15 పోస్టులు
4. పైలట్: 25 పోస్టులు
5. లాజిస్టిక్స్: 20 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచి:
6. ఎడ్యుకేషన్: 12 పోస్టులు
టెక్నికల్ బ్రాంచి:
7. ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 25 పోస్టులు
8. ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 45 పోస్టులు
9. నావల్ కన్స్ట్రక్టర్: 14 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 217
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56100తో పాటు ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.
సీఆర్పీఎఫ్లో 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్… స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ 'సి' విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
హెడ్ కానిస్టేబుల్: 322 పోస్టులు
క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, వాటర్ పోలో, ట్రయాథ్లాన్, తైక్వాండో, వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్(ఫ్రీ స్టైల్), రెజ్లింగ్ (గ్రీకో రోమన్), ఉషు.
జీత భత్యాలు: రూ.25500 - రూ.81100.
అర్హత: పన్నెండో తరగతితోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరా ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు, ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తుకు చివరి తేదీ: రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
Indian Post: తపాలా శాఖలో పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు
Indian Post: తపాలా శాఖలో పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు
గుజరాత్ సర్కిల్, అహ్మదాబాద్‌లోని ఇండియన్ పోస్ట్, స్పోర్ట్స్/ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్… స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఖాళీల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్లు: 71 పోస్టులు
2. పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్: 56 పోస్టులు
3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 61 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 188
అర్హత: పది, పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2022.
AOC: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 419 మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు
AOC: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 419 మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు
సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్… దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
వివరాలు:
మెటీరియల్ అసిస్టెంట్: 419 పోస్టులు
రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్- 10, వెస్ట్రన్- 120, నార్తెర్న్- 23, సదరన్- 32, సౌత్ వెస్ట్రన్- 23, సెంట్రల్ వెస్ట్- 185, సెంట్రల్ ఈస్ట్- 26.
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజినీరింగ్/ డిప్లొమా(మెటీరియల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.29,200 నుంచి రూ.92,300.
ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
IOB: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
IOB: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు స్థాపించిన స్నేహ ట్రస్ట్… ఒప్పంద ప్రాతిపదికన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ఫ్యాకల్టీ: 07 పోస్టులు
2. ఆఫీస్ అసిస్టెంట్: 08 పోస్టులు
3. అటెండర్: 09 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 24
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన తేదీ నుంచి 15 రోజులల్లోగా దరఖాస్తు చేయాలి.
ప్రకటన తేదీ: 26/10/2022.
DRDO: డీఆర్డీవోలో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
DRDO: డీఆర్డీవోలో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్డీవో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(సెప్టమ్-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
1. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు
4. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 12 పోస్టులు
6. స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు
7. స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 04 పోస్టులు
8. సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు
9. వెహికల్ ఆపరేటర్ ‘ఎ’: 145 పోస్టులు
10. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’: 18 పోస్టులు
11. ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1061.
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35400-రూ.112400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25500-రూ.81100, ఇతర పోస్టులకు రూ.19900-రూ.63200 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.
VC: దామోదర్ వ్యాలీలో ఓవర్‌మ్యాన్, మైన్ సర్వేయర్ పోస్టులు
DVC: దామోదర్ వ్యాలీలో ఓవర్‌మ్యాన్, మైన్ సర్వేయర్ పోస్టులు
కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్… ఒప్పంద ప్రాతిపదికన ఓవర్‌మ్యాన్, మైన్ సర్వేయర్ (గ్రూప్ బి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ఓవర్‌మ్యాన్: 08 పోస్టులు
2. మైన్ సర్వేయర్: 03 పోస్టులు
అర్హత: డిప్లొమా(మైనింగ్ ఇంజినీరింగ్/ మైనింగ్ & మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు ఓవర్‌మ్యాన్ ఖాళీలకు రూ.45,000, మైన్ సర్వేయర్ ఖాళీలకు రూ.42,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09/11/2022.
NIWE: ఎన్ఐడబ్ల్యూఈ-చెన్నైలో 16 పోస్టులు
NIWE: ఎన్ఐడబ్ల్యూఈ-చెన్నైలో 16 పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ(ఎన్ఐడబ్ల్యూఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితరాలు.
విభాగాలు: మేనేజ్మెంట్, ఫైనాన్షియల్, టెక్నికల్, గ్రేడ్ 1 తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 28-40 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25000-రూ.40000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 11.11.2022
డబ్ల్యూఎస్సీ-గువాహటిలో 30 వివిధ ఖాళీలు
డబ్ల్యూఎస్సీ-గువాహటిలో 30 వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన గువాహటిలోని వీవర్స్ సర్వీస్ సెంటర్(డబ్ల్యూఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 30
పోస్టులు: జూనియర్ వీవర్, సీనియర్ ప్రింటర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 27-30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు 18000-రూ.92300 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ది డైరెక్టర్, వీవర్స్ సర్వీస్ సెంటర్, ఐఐహెచ్‌టీ క్యాంపస్, జవహర్ నగర్, ఖానపర, గువాహటి 781022.
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టులు
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో… దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు
2. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 150 పోస్టులు
అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి ఎస్ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21700-రూ.69100, ఎంటీఎస్ పోస్టులకు రూ.18000-రూ.56900.
పరీక్షా విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 05-11-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022.
కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు SSC Constable Jobs
SSC Constable Jobs: కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)లో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఖాళీల వివరాలు...
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)/ సిపాయి: 24369 పోస్టులు
పార్ట్ - 1 ఖాళీలు:
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్): 10497 పోస్టులు(పురుషులు- 8922; మహిళలు- 1575)
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్): 100 పోస్టులు(పురుషులు- 90; మహిళలు- 10)
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్): 8911 పోస్టులు(పురుషులు- 8380; మహిళలు- 531)
4. సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ): 1284 పోస్టులు(పురుషులు- 1041; మహిళలు- 243)
5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 1613 పోస్టులు(పురుషులు- 1371; మహిళలు- 242)
6. అస్సాం రైఫిల్స్(ఏఆర్): 1697 పోస్టులు (పురుషులు-1697)
7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్): 103 పోస్టులు (పురుషులు- 78; మహిళలు- 25)
పార్ట్ - 2 ఖాళీలు:
8. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ): 164 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.
వయోపరిమితి: జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2000 కంటే ముందు, 01-01-2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: సిపాయి పోస్టుకు రూ.18,000-రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700-రూ.69,100 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ అంశాలనుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
దరఖాస్తు రుసుము: రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 27-10-2022 నుంచి 30-11-2022 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30-11-2022.
ఆఫ్‌లైన్ చలానా రూపొందించేందుకు చివరి తేదీ: 30-11-2022.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-12-2022.
చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-12-2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: జనవరి, 2023
SSC Constable GD Recruitment 2022
Staff Selection Commission (SSC) has released the notification of SSC Constable GD in BSF, CISF, ITBP, CRPF, NCB, SSF, Assam Rifles Exam 2022. All the candidates who are interested in this SSC Constable 2022 recruitment and fulfill the eligibility can apply online from 27 October 2022 to 30 November 2022. Read the notification for eligibility, age limit, selection procedure, syllabus, pattern, pay scale and all other information in SSC Constable Recruitment Exam 2022.
|
SSC GD Constable Notification 2022 Category Wise Details | ||||||||||||||||||||
Post Name | SSC GD Constable Male | SSC GD Constable Female | ||||||||||||||||||
Force | Code | UR | EWS | OBC | SC | ST | Total | UR | EWS | OBC | SC | ST | Total | |||||||
BSF | A | 3733 | 887 | 1980 | 1405 | 917 | 8922 | 661 | 158 | 348 | 245 | 163 | 1575 | |||||||
CISF | B | 50 | 09 | 18 | 08 | 05 | 90 | 10 | 0 | 0 | 0 | 0 | 10 | |||||||
CRPF | C | 3710 | 878 | 1975 | 1357 | 460 | 8380 | 228 | 52 | 118 | 84 | 49 | 531 | |||||||
SSB | D | 464 | 54 | 243 | 204 | 76 | 1041 | 107 | 0 | 69 | 61 | 06 | 243 | |||||||
ITBP | E | 637 | 110 | 277 | 188 | 159 | 1371 | 135 | 07 | 48 | 30 | 22 | 242 | |||||||
AR | F | 716 | 169 | 308 | 191 | 313 | 1697 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |||||||
SSF | H | 32 | 08 | 14 | 24 | 0 | 78 | 10 | 02 | 05 | 08 | 0 | 25 | |||||||
NCB | G | UR : 67 | OBC : 38 | EWS : 23 | SC : 25 | ST : 11 | Total : 164 | ||||||||||||||||||
SSC Constable GD 2022 Physical Eligibility | ||||||||||||||||||||
Category | Male Gen / OBC /SC | Male ST | Female Gen/OBC/SC | Female ST | ||||||||||||||||
Height | 170 CMS | 162.5 CMS | 157 CMS | 150 CMS | ||||||||||||||||
Chest | 80-85 CMS | 76-80 CMS | NA | NA | ||||||||||||||||
Running | 5 KM in 24 Minutes | 5 KM in 24 Minutes | 1.6 Km in 8.5 Minutes | 1.6 Km in 8.5 Minutes |
How to Fill SSC Constable GD Recruitment Online Form 2022
- Staff Selection Commission SSC Constable GD Recruitment 2022, Candidate Can Apply Between 27/10/2022 to 30/11/2022.
- Candidate Read the Notification Before Apply the Recruitment Application Form in Constable GD Vacancy 2022.
- Kindly Check and Collect the All Document - Eligibility, ID Proof, Address Details, Basic Details.
- Kindly Ready Scan Document Related to Recruitment Form - Photo, Sign, ID Proof, Etc.
- Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.
- If Candidate Required to Paying the Application Fee Must Submit. If You have Not the Required Application Fees Your Form is Not Completed.
- Take A Print Out of Final Submitted Form.
Apply Online | Click Here |
Download Notification | Click Here | |||||||||||||||||||
Download Syllabus | Click Here |