Pages

Tuesday, 3 July 2018

వీఆర్వో పోస్టుల దరఖాస్తు గడువు పెంపు!

తెలంగాణలో వీఆర్వో సహా పలు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెరిగింది. ఏఎస్‌ఓ, వీఆర్వో, సీసీఎల్‌ఏ, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సోమవారం (జులై 2) అధికారికంగా ప్రకటించింది. దరఖాస్తు గడువును జులై 8 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం ఆఖరిరోజు.


అయితే చివరిరోజు కావడంతో చాలా మంది టీఎస్‌పీఎస్సీ సైట్‌కి లాగిన్ అవ్వడంతో.. టీఎస్‌పీఎస్సీ సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో దరఖాస్తు గడువు పెంచమని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పెంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇప్పటి వరకు వీఆర్వో ఉద్యోగాలకు 9 లక్షల 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఏఎస్‌వో ఉద్యోగాలకు 7500, స్టెనో ఉద్యోగాలకు 500 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.

No comments:

Post a Comment