Pages

Saturday, 12 March 2016

భక్తి భజన సంకీర్తన పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్ : భక్తి భజన సంకీర్తన పోటీలు ఏప్రిల్ 10 నుం చి 14 వరకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ అధ్యక్షురాలు జె.సుధారాణి తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఔత్సాహిక భజన సమాజం వారిని ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 9652027111, 9642326567 నెంబర్లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో సంస్థ ప్రధానకార్యదర్శి జె.శివప్రసాద్,ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment