Pages

Wednesday, 9 March 2016

రూ. 1 కోటి లాటరీ లక్ తగిలింది...

lottery ticketఓ యువకుడు పొట్ట నింపుకోడానికి సొంత రాష్ట్రంలో పనులు దొరకలేదని.. పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లాడు. ఆ యువకుడిని అదృష్టలక్ష్మి వరించింది. రాష్ట్రం విడిచి వెళ్లిన మూడు రోజులకే కోటి రూపాయల లాటరీ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన మొఫిజుల్ రహనా షెక్ అనే యువకుడు ఈ నెల 4వ తేదీన కేరళకు వలస వెళ్లాడు. 
 
అదేరోజు అక్కడ 50 రూపాయలు పెట్టి.. 'కారుణ్య' లాటరీ టికెట్ కొన్నాడు. తర్వాతి రోజు నిర్వహించిన డ్రాలో అతడికి కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. దాంతో.. తనతో పాటు వచ్చిన వలస కూలీలు తనమీద దాడి చేసి, ఆ లాటరీ టికెట్ ఎక్కడ లాగేసుకుంటారోననే భయంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి భద్రత కోరాడు.
 
పోలీసులు అతడిని బ్యాంకుకు తీసుకెళ్లి, అక్కడ అకౌంటు ఓపెన్ చేయించి, టికెట్ కూడా అక్కడే సమర్పించారు. దాంతో కోటి రూపాయలలో పన్నులు మినహాయించగా మిగిలిన మొత్తం అతడి ఖాతాలోకి నేరుగా జమ అయిపోతుందన్న మాట

No comments:

Post a Comment